రైల్వే పోలీసుపై యాసిడ్‌ దాడి చేసిన భార్య

కర్నూలు: ఓ రైల్వే పోలీసుపై అతని భార్య యాసిడ్‌ దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుగా పనిచేస్తున్న వీరారెడ్డి అనే వ్యక్తి స్థానిక ఎన్జీవో కాలనీలో ఉంటున్నాడు. నిన్న రాత్రి అతను నిద్రిస్తుండగా భార్య లక్ష్మీ యాసిడ్‌ పోసింది. తీవ్రగాయాలతో అతను నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబకలహాల నేపథ్యంలోనే భార్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.