రైల్వే వ్వవస్థను ప్రైవేటీకరించటానికి ప్రభుత్వం సిద్ధం: శంకరావు

గుంతకల్లు: రైల్వే వ్వవస్థను ప్రైవేటీకరించటానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీన్ని అడ్డుకోవటానికి కార్మికులు ఉద్మమాలకు సిద్ధపడాలని రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సికింద్రాబాదు జోనల్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శంకరావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్మికులు డిమాండ్లను పరిష్కరించాలని అక్టోబరు 9న దేశవ్యాప్తంగా 24 గంటలపాటు నిరాహరదీక్షలకు పూనుకొంటున్నట్లు చెప్పారు. భారత ప్రభుత్వం రైల్వేకు ఆధారిత బడ్జెట్‌ను కేటాయించకుండా నష్టాల్లోకి నెడుతోందని విమర్శించారు. పెరిగిన డీజిల్‌ ధరల వల్ల రూ.1200 కోట్లు, విద్యుత్తు ఛార్జీల పెంపువల్ల మరో రూ.100 కోట్ల దాకా రైల్వేపై అదనపుభారం పడిందని చెప్పారు.