రోగాలతో ప్రజలు సతమతం

ఆదిలాబాద్‌, జూలై 28 : వైద్య అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గ్రామాలలోని ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎంతోమంది రోగాలతో మంచాలు పడుతున్నారు. ప్రతి వర్షకాలం కంటే ముందు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలు చేస్తున్నప్పటికీ గ్రామాల్లో పారిశుద్ద్యం ఆస్తవ్యస్తంగా మారి వ్యాధులు ప్రబలి ప్రజల ప్రాణాలు హరీమంటున్నాయి. మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించినప్పటీకి వారు పర్యవేక్షించకపోవడంతో ప్రజలు పరిహారం చెల్లించుకోకపోతప్పడం లేదు. వర్షాలు విస్తృతంగా కురియడంతో ప్రత్యేకించి మారుమూల గిరిజన గ్రామాల్లో పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో గత నెల రోజులుగా జ్వరాలు, అతిసారం సోకి సుమారు 20 మందివరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. జిల్లాలోని నార్నూర్‌, కోటపల్లి, కాసీపేట, ఇంద్రవెల్లి, తలమడుగు మండలాల్లోని అనేక గ్రామాల్లో వివిధ వ్యాధులు సోకి ప్రజలు మృతి చెందారు. వర్షకాలంలో ప్రజలు కలుషితమైన నీరు తాగడంతో ప్రజలు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటి సరఫరా కాకపోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏడాది వర్షకాలంలో వ్యాధులు ప్రబలి ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్న శాశ్వత చర్యలు చేపడట్టడంలో మాత్రం జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వర్షకాలం ప్రారంభం కాకముందే పెద్దఎత్తున సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రజలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించిన అందుకు కావాల్సిన చర్యలు మాత్రం చేపట్టిన దాఖలాలు మాత్రం లేవు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించకపోవడంతో జిల్లాలోని అన్ని మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినప్పటికీ వారు గ్రామాల్లో పర్యటించకపోవడంతో అష్టవ్యస్తకంగా మారాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు చేప్పటకపోవడం, తాగునీటి సరఫరా చేయకపోవడం వైద్య సౌకర్యాలు తీరును అధికారులు పరిశీలించకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యా లకు గురవుతూ, వ్యాధులకు బలవుతున్నారు. ఇప్పటికైన జిల్లా యంత్రాంగం స్పందించి ప్రజల ప్రాణాలు పోకుండా, వారు రోగల భారిన పడకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞాప్తి చేస్తున్నారు.