రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు

అనంతపురం: వివాహానికి హాజరై తిరిగి వెళ్తుతున్న వారి వాహనం ప్రమాదానికి గురై ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుందుర్పికి చెందిన ఒక కుటుంబం అనంతపురం జిల్లా హందూపురంలోని వివాహానికి హాజరై తిరిగి వెళుతుండగా వారి వాహనాన్ని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢికొంది. ఈ సంఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో వెంకమ్మ,లక్ష్మిదేవమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో బెంగూళూరు తీసుకెళ్లారు.