రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

సారంగపూర్‌: మండల కేంద్రానికి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆడెల్లి గ్రామానికి చెందిన గంగయ్య, కేసరపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో నిర్మల్‌ ఆసుపత్రికి తరలించారు.