రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసుల మృతి

భువనేశ్వర్‌,మార్చి1(జ‌నంసాక్షి): ట్రక్కు ఢీకొని ఇద్దరు పోలీసు సిబ్బంది మృతిచెందారు. ఈ విషాద సంఘటన ఒడిశాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జార్సుగూడ జిల్లా బెల్‌పహార్‌ సవిూపంలోని జాతీయ రహదారి-49పై వేగంగా ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి పోలీసు వ్యానును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసు సిబ్బంది మృతిచెందగా మరో 17 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. వ్యానులో మొత్తం 33 మంది పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సవిూప ఆస్పత్రికి తరలించారు.