రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేకు గాయాలు

నల్గొండ: జిల్లాలోని చివమెల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మధిర మాజీ ఎమ్మెల్యే వెంకటనర్సయ్యను హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆయన తుంటి ఎముక విరిగినట్లు ఆయన బంధువులు తెలియజేశారు. వెంకటనర్సయ్య ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని వివరించారు.