రోడ్డు ప్రమాదంలో ముగ్గురిమృతి

మహబూబ్‌నగర్‌: కొత్తపేట మండలం రాయిమిపేట స్టేజి వద్ద ఈరోజు సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కొత్తపేట ఎస్సై నాగేశ్వరరావు కథనం ప్రకారం మండలంలోని పొన్నూరు తండా, నర్శింగపురం తండాలకు చెందిన రాయుడు నాయక్‌, మీనాదేవి, మహేష్‌నాయక్‌లు ధ్విచక్రవాహనంపై రాయిమిపేట నుంచి జాతీయరహదారి పైకి వస్తుండగా హైదరాబాద్‌ నుంచి ర్నూలు వెళ్తున్న కారు వీరి ద్విచకవ్రాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వారు 20 అడుగుల మేర ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.