రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరుకు గాయాలు

ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌ గౌర్‌  రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఎచ్చెర్ల మండలం సనపలవాలనిపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రాక్టరు ఢీకొనడంతో కలెక్టరు సౌరభ్‌ గౌర్‌కు గాయాలయ్యాయి. ఆయనను వెంటనే 108లో రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.