లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌

వినుకొండ: నూజెండ్ల తహశీల్దార్‌ డి. పద్మాలక్ష్మీ గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. మండలంలోని తలార్లపల్లికి చెందిన దాట్ల అంజిరెడ్డి దగ్గర డీకే పట్టా కోసం ఆమె రూ. 30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.