లండన్‌ ఒలింపిక్స్‌కు సురేశ్‌ కల్మాడీ

ఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌కు హాజరయ్యేందుకు సురేశ్‌ కల్మాడీకి అనుమతి లభించింది. పాటియాలా హౌన్‌ కోర్టు ఆయనకు ఈ అనుమతి మంజూరు చేసింది. జూలై 26నుంచి ఆగస్టు 13 వరకు ఆయన  ఒలింపిక్స్‌కి వెళ్లిరావచ్చని న్యాయస్ధానం పేర్కొంది. కామన్‌వెల్త్‌ క్రీడలకు సంబంధించిన కుంభకోణంలో అరెస్టయిన సురేశ్‌ కల్మాడీకి పది నెలల జైలులో ఉన్న తర్వాత హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.