లక్ష్మణ్‌బాపూజీ మృతికి యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సంతాపం

హైదరాబాద్‌: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ మృతి పట్ల యూపీఏ ఛైరపర్సన్‌ సోనియాగాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి కొండా లక్ష్మణ్‌ బాపూజీ కుమార్తె పవిత్ర వాణికి లేఖ ద్వారా సానుభూతి తెలిపారు. దేశం ఓ సమరయోధుడ్ని కోల్పోయిందని, స్వాతంత్ర సమరంలో బాపూజీ సేవలు చిరస్మరణీయమని లేఖలో పేర్కొన్నారు.