లక్ష్మీనారాయణతో సమావేశమైన ఈడీ అధికారులు

హైదరాదబాద్‌: సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణతోఈడీ అధికారులు సమావేశమయ్యారు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాలు, జగన్‌ అర్కమాస్తుల కేసు, ఎమ్మార్‌ కేసులో నిందితులను చంచల్‌గూడ కారాగారంలో ఈడీ బృందాలు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి సీబీఐ సేకరించిన ఆధారాలను ఈడీ తీసుకున్నట్లుగా సమాచారమందింది.