లగడపాటిపై ఎంపీ రాజయ్య మరోసారి ఫైర్‌

వరంగల్‌: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై ఎంపీ సిరిసిల్ల రాజయ్య మరోసారి ఫైర్‌ అయ్యారు. లగడపాటికి బుద్ది మందగించిందని, వెంటనే ఆయనను ఎర్రగడ్డలోని ఆస్పత్రిలో చేర్పించాలని రాజయ్య సూచించారు. సున్నితమైన తెలంగాణ అంశంపై ఆయన పదేపదే  కామెంట్లు చేయడంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయంతో తెలంగాణ రాదని  లగడపాటి రాజగోపాల్‌ అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

తాజావార్తలు