లాభాలతో ముగిసిన సెన్సెక్స్
ముంబయి: ఈరోజు సెన్సెక్స్ 56.47 పాయింట్ల ఆధిక్యతో 17,440.87 వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 20.25 పాయింట్ల లాభంతో 5,247 వద్ద ముగిశాయి. మార్కెట్ ప్రారంభంలో నష్టపోయినప్పటకీ చివరి రెండుగంటల్లో ట్రేడింగ్ జరగడంతో సెన్సెక్స్ లాభాల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉన్నప్పటికీ భారత్‌లో మంచి అభివృద్ధి రేటు సాధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్న వార్తలు మార్కెట్ జోరుకు దోహదం చేసింది.



