లీలావతి ఆసుపత్రిలో బాల్‌థాకరే

ముంబాయి: శివసేన అధినేత బాల్‌థాకరే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం ముంబాయి శివారు బాంద్రాలోని లీలావతి ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆందోళన చెందాల్సింది ఏమీలేదని వివరించారు. బాల్‌ థాకరే రెండు, మూడు రోజులు ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉంది. బాల్‌థాకరే కుమారుడు ఉద్దవ్‌కు వారం రోజుల కిందట లీలావతి ఆసుపత్రిలో ఏంజీయోప్లాస్టీ జరిగిన సంగతి తెలిసిందే.