*లెంకల గడ్డలో వైద్య శిబిరం*
*రోగులకు మందుల పంపిణీ*
*పలిమెల ఆగస్ట్ 24 (జనంసాక్షి)*
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో అంబట్ పల్లి ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ ప్రమోద్ ఆధ్వర్యంలో బుధవారం రోజున వైద్య శిబిరం ఏర్పాటు చేసారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 80 మందికి పై గా రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేసినట్లు వైద్యులు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలియచేసారు. ఇంటి ఆవరణలో చెత్తచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో హెల్త్ సూపర్ వైజర్ మాశూక్ అలి, ఎల్.టి సుధాకర్, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఏఎన్ఎం శ్రీలత, ఆశ వర్కర్ నిర్మల, కాంటిజెంట్ వర్కర్ శ్రీనివాస్, ప్రజలు పాల్గొన్నారు.