లోక్‌సభ నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరిరోజున కూడా బొగ్గుకుంభకోణంపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి.ఉదయం వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే.. ప్రధాని రాజీనామా చేస్తేనే సభనుకొనసాగిస్తామని సభ్యులు  నిరసన వ్యక్తం చేశారు. సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు.