వడగండ్ల వర్షానికి నేలరాలిన పంటలు,వడగండ్ల వర్షానికి నేలరాలిన పంటలు, నష్టపోయిన రైతులను

 ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్
డీబీఎం-40 కెనాల్ వద్ద చర్చకు రావాలి.ఎమ్మెల్యే కి సవాల్ విసిరిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్
జనం సాక్షి, చెన్నరావు పేట
మండలం వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురిసిన అకాల  వడగండ్ల వర్షానికి నేలమట్టం అయిన మొక్కజొన్న,మిర్చి,మామిడి,టమాట పంటలు చెన్నారవు పేట మండల వ్యాప్తంగా నేల రాలయని,రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ . సోమ వారం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసారు. చేతికొచ్చిన పంట అకాల వర్షానికి దెబ్బతిందని,కొన్ని వేలల్లో పెట్టుబడి పెట్టిన రైతుకు  కనీసం పెట్టుబడి  కూడా వచ్చే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..అత్యవసర విపత్తు ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సుమారు 15 వేల కోట్ల రూపాయలను నష్ట పోయిన రైతులకు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో సుమారు 5000 ఎకరాల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు 25000 రూపాయల  నష్ట పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.అలాగే నిన్న ఉప్పర పెల్లి లో కేవలం 3-4 కుటుంబాలకు కండువా కప్పి 200 కుటుంబాలు పార్టీ మారారని ప్రగడ్బాలు పలకడం విడ్డురంగా ఉందని మీకు దమ్ము,ధైర్యం ఉంటే పార్టీ మారిన కుటుంబాల పేర్లు బహిర్గతం చేయాలని, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని డిమాండ్ చేశారు.అలాగే కొనపురం గ్రామంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పగటి వేశగాళ్ళు, తెల్ల చొక్కాలు వేసుకొని వస్తున్నారని ఎద్దేవా చేసే ముందు నువ్వు సివిల్ సప్లై చైర్మన్ కాక ముందు తెల్ల చొక్కా కాదు కదా వేసుకోడానికి మాములు చొక్కాలు కూడా లేవని,అది ఎవరు పెట్టిన భిక్ష అని ప్రశ్నించుకోవాలని గోపాల్ నాయక్ మండి పడ్డారు. కొనపురం గ్రామంలో డిబి ఎం-40 కాలువ తీసింది కాంగ్రెస్  పార్టీ అని ఆ కాలంలో కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దని,డిబిఎమ్ -40 కాలువ తీసినప్పుడు ఎమ్మెల్యే నల్లబెల్లి పరిధిలో కూడా లేడని ఈ సందర్భంగా గోపాల్ నాయక్ గుర్తు చేశారు.దమ్ముంటే  ఎమ్మెల్యే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.అలాగే గత సంవత్సరం అకాల వర్షాలతో రైతన్నలు నష్ట పోతే కనీసం ఒక రూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వని ఎమ్మెల్యే ఇప్పుడు పగటి వేశగాళ్ళ లాగా తు తు మంత్రంగా సర్వే చేసి పరిహారం ఇప్పిస్తానని మరోక సారి రైతులను మోసం చేయడానికి వచ్చాడని,ప్రజలు అన్ని  గమనిస్తున్నారని గోపాల్ నాయక్ దుయ్య బట్టారు. అలాగే చెన్నారవు పేట నుండి ఉప్పర పెల్లి కి వెళ్లే రహదారి రోడ్డు వేయకముందే శంకుస్థాపన చేయడం విడ్డురంగా ఉందని ఆయన అన్నారు.మండలం లో నత్త నడకన పనులు ప్రారంభించి ఇప్పటి వరకు పనులు పూర్తి చేయకుండా కమిషన్ ల కోసమే రోడ్లు విస్తరణ పనులు మొదలు పెట్టకుండా పబ్బం గడుపుతున్నాడని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే తప్ప,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం డబల్ బెడ్రూం ఇల్లు ఏ ఒక్కటి అయిన కట్టావా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు ఉన్న ప్రతి గడపకు ఓట్లు మేము అడుగుతామని,డబల్ బెడ్రూం లేని ఏ ఒక్క గ్రామంలో ఓట్లు అడగవద్దని,ఆ దమ్ము మీకు ఉందా అని ప్రశ్నించారు…ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్ల పెల్లి నర్సయ్య గౌడ్,జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి,నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, మండల ఉపాధ్యక్షులు నన్నెబొయిన రమేష్ యాదవ్,మండల ప్రధాన కార్యదర్శి మంచాల సదయ్య, కిసాన్ సెల్,బీసీ సెల్ మైనారిటీ అద్యక్షులు సంపత్ రెడ్డి, విజేందర్ గౌడ్,అమీరొద్దీన్,సర్పంచులు సిద్దేన రమేష్,తప్పేట రమేష్,భద్రు నాయక్,గ్రామ పార్టీ అధ్యక్షులు నర్సు నాయక్,కనకమల్లు,రమేష్ నాయక్,రవి,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్,మండల యువజన కాంగ్రెస్ అద్యక్షుడు బండి హరిష్,నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జెపాల్ రెడ్డి,వీరేందర్ నాథ్,కూస సుదర్శన్,మల్ల స్వామి,యువజన కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్ తదితరులు పాల్గోన్నారు.