వడగండ్ల వాన బాధిత రైతులకు కడగండ్లు మిగిల్చాయి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్.
…వడగండ్ల వాన బాధిత రైతులకు కడగండ్లు మిగిల్చాయి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్….
అకాల వర్షం అపార నష్టం కలిగించింది
పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ విస్తృత పర్యటన
డోర్నకల్ ప్రతినిధి, మార్చి 20: (జనం సాక్షి )అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించిందని వడగండ్లు వాన రైతులకు కడగండ్లు మిగిల్చాయి ప్రకృతి ప్రకోపించింది, రైతులు తీరని నష్టాలలోకూరుకుపోయారని నష్టపోయిన బాధిత రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. డోర్నకల్ నియోజకవర్గ వివిధ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన అనంతరం డి ఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూరైతులు ఆందోళన పడాల్సిన పనిలేదని అధికారులు పంట నష్టాలు అంచనా వేస్తున్నారని ఆ నివేదికలు రాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించే బాధ్యతని తీసుకుంటానని అన్నారు. శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు పలు గ్రామాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. ఒకవైపు పంట నష్టాల అంచనా వేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే స్వయంగా రైతుల పొలాలకు చెలకల వద్దకు వెళ్లి రోజంతా పంట నష్టాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి బాధలు కన్నీరు పెట్టుకున్న రైతులను అక్కున చేర్చుకుని ఓదార్చారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు కొందరు, కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న రైతులు మరికొందరు భర్త లేకపోయినా ధైర్యంగా సాగు చేసిన మహిళలు మరికొందరు, నేలతల్లిని నమ్ముకొని తమ కష్టాలు తీరుతాయని, ఎంతో ఆశగా వేసిన పంట చేతికి వచ్చే సమయానికి కురిసిన అకాల వడగండ్ల వాన రైతుల కుటుంబాల్లో కడగండ్లు మిగిల్చాయి దీంతో రైతులను డోర్నకల్ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ ఓదార్చారు. ధైర్యం చెప్పారు, అండగా ఉంటామని నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతు నష్టాల కు పరిహారo ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అని రైతులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానికులు రైతులు పాల్గొన్నారు