‘వనదీక్ష’లో రచ్చకెక్కిన విభేదాలు

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ నియోజక వర్గంలో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు రచ్చ కెక్కాయి. మెట్రో రైలు వనదీక్ష కార్యక్రమాన్ని శనివారం పార్లమెంటు సభ్యులు మంత్రి మహీధరరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సర్వే సత్యనారాయణ,ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శాసనసభ్యుడు సుదీర్‌రెడ్డిపై హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాంమోహన్‌ గౌడ్‌ అనుచరులు గొడవకు దిగారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ వర్గయులు రెండు గ్రూపులుగా విడిపోవటంతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి.