వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలి:

వరంగల్‌: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న మరణాలపై స్పందిస్తూ రాజ్యసభ సభ్యుడు ఆనంద& భాస్కర్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రికి ఆధునిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధికి స్థానిక నాయకులతో చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.