వరదబాధితులను ఆదుకుంటాం

మృతుల కుటుంబాలకు లక్షన్నర ఎక్స్‌గ్రేషియా
ఇళ్లు కోల్పోయినవారికి ఇళ్లు : సీఎం
హైదరాబాద్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి):
వరదలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు రూ.1.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తెలిపింది. అలాగే, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, సబితాఇంద్రారెడ్డి, రఘువీ రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, టీజీ వెంకటేశ్‌, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వరద నష్టంపై ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పునరుద్ధరణ, నీటి సరఫరా వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. వీలైనంత వరకు తుపాను ప్రభావం ప్రజల విూద పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సవిూక్ష అనంతరం మంత్రి రఘువీరా వివరాలను వెల్లడించారు. మంగళవారం ఐదు వరద బాధిత జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 5.25 లక్షల హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగాయన్నారు. హర్టికల్చరల్‌కు సంబంధించి 24 వేల హెక్టార్లలో నష్టం జరిగిందని చెప్పారు. మత్స్య పరిశ్రమకు కూడా పెను నష్టం వాటిల్లిందని వివరించారు. ఆర్‌ అండ్‌ బీ రోడ్లు 3,100 కిలోవిూటర్లు, పంచాయతీరాజ్‌ రోడ్లు 3,700 కి.విూ. మేర నీటి మునిగాయని తెలిపారు. 1086 చిన్నతరహా ప్రాజెక్టులు, 18 మధ్యతరహా ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని వివరించారు. 427 గ్రామాల్లో, 47 మునిసిపాలిటీల్లో నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతిందని, 225 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, స్పెషల్‌ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మొత్తం 170 సహాయక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో దాదాపు 68 వేల మంది బాధితులు పునరావాసం పొందుతున్నారని వివరించారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.
వరద పరిస్థితిపై సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమక్షిస్తున్నారని తెలిపారు. నీలం తుపాను కారణంగా చనిపోయిన కుటుంబాలకు రూ.1.50 లక్షల పరిహారం అందచేయాలని సీఎం నిర్ణయించారని, తక్షణమే ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం కూడా చెల్లించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి కూడా సహాయం అందజేయాలని సీఎం సూచించారని రఘువీరా తెలిపారు. ఇందిరా ఆవాస్‌ యోజన కింద బాధితులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఇళ్లు కోల్పోయిన వారికి అందచేయనున్నట్లు చెప్పారు. ఇళ్ల మంజూరు అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్లు చెప్పారు. అలాగే, పశువులు నష్టపోయిన వారికి కూడా పరిహారం కూడా అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న నిబంధనలు సవరిస్తూ.. ఎన్ని చనిపోతే అన్నింటికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పంట నష్టానికి సంబంధించి పారదర్శకంగా పరిహారం అందజేయనున్నట్లు చెప్పారు. పరిహారంపై గ్రామసభల్లో తీర్మానించిన తర్వాత ఆ జాబితా తమకు అందజేస్తే పరిహారం చెల్లిస్తామని తెలిపారు. పంట పెట్టిన వారికే మాత్రమే పరిహారం అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే, రోడ్లు, చెరువులు, సాగునీటి వ్యవస్థ పునరుద్ధణ తక్షణమే చేపట్టాలని సీఎం ఆదేశించారన్నారు. సాగునీటి వ్యవస్థ పునరుద్ధరించే వరకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలని, అలాగే, యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని సూచించారన్నారు. చెరువులు, కాలువల మరమ్మతులకు రూ.10 లక్షల వరకు మంజూరు చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తున్నట్లు తెలిపారు. రూ. 5 లక్షల వరకు పనులను నామినేషన్లపై చేపట్టవచ్చని తెలిపారు. వరదల కారణంగా నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.పునరుద్ధరణ, నీటి సరఫరా వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. వీలైనంత వరకు తుపాను ప్రభావం ప్రజల విూద పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సవిూక్ష అనంతరం మంత్రి రఘువీరా వివరాలను వెల్లడించారు. మంగళవారం ఐదు వరద బాధిత జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 5.25 లక్షల హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగాయన్నారు. హర్టికల్చరల్‌కు సంబంధించి 24 వేల హెక్టార్లలో నష్టం జరిగిందని చెప్పారు. మత్స్య పరిశ్రమకు కూడా పెను నష్టం వాటిల్లిందని వివరించారు. ఆర్‌ అండ్‌ బీ రోడ్లు 3,100 కిలోవిూటర్లు, పంచాయతీరాజ్‌ రోడ్లు 3,700 కి.విూ. మేర నీటి మునిగాయని తెలిపారు. 1086 చిన్నతరహా ప్రాజెక్టులు, 18 మధ్యతరహా ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని వివరించారు. 427 గ్రామాల్లో, 47 మునిసిపాలిటీల్లో నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతిందని, 225 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, స్పెషల్‌ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మొత్తం 170 సహాయక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో దాదాపు 68 వేల మంది బాధితులు పునరావాసం పొందుతున్నారని వివరించారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.
వరద పరిస్థితిపై సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమక్షిస్తున్నారని తెలిపారు. నీలం తుపాను కారణంగా చనిపోయిన కుటుంబాలకు రూ.1.50 లక్షల పరిహారం అందచేయాలని సీఎం నిర్ణయించారని, తక్షణమే ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం కూడా చెల్లించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి కూడా సహాయం అందజేయాలని సీఎం సూచించారని రఘువీరా తెలిపారు. ఇందిరా ఆవాస్‌ యోజన కింద బాధితులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఇళ్లు కోల్పోయిన వారికి అందచేయనున్నట్లు చెప్పారు. ఇళ్ల మంజూరు అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్లు చెప్పారు. అలాగే, పశువులు నష్టపోయిన వారికి కూడా పరిహారం కూడా అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న నిబంధనలు సవరిస్తూ.. ఎన్ని చనిపోతే అన్నింటికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పంట నష్టానికి సంబంధించి పారదర్శకంగా పరిహారం అందజేయనున్నట్లు చెప్పారు. పరిహారంపై గ్రామసభల్లో తీర్మానించిన తర్వాత ఆ జాబితా తమకు అందజేస్తే పరిహారం చెల్లిస్తామని తెలిపారు. పంట పెట్టిన వారికే మాత్రమే పరిహారం అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే, రోడ్లు, చెరువులు, సాగునీటి వ్యవస్థ పునరుద్ధణ తక్షణమే చేపట్టాలని సీఎం ఆదేశించారన్నారు. సాగునీటి వ్యవస్థ పునరుద్ధరించే వరకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలని, అలాగే, యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని సూచించారన్నారు. చెరువులు, కాలువల మరమ్మతులకు రూ.10 లక్షల వరకు మంజూరు చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తున్నట్లు తెలిపారు. రూ. 5 లక్షల వరకు పనులను నామినేషన్లపై చేపట్టవచ్చని తెలిపారు. వరదల కారణంగా నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.