వరదలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

share on facebook

వేములవాడ రూరల్, ఆగస్టు- 5(జనం సాక్షి) :

వేములవాడ గ్రామీణ మండలం ఫాజల్ నగర్ వద్ద వరదలో చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు కాపాడారు. నల్లగొండ గ్రామానికి చెందిన మొహమ్మద్ ఖాజా ఫాజుల్ నగర్ నుండి నల్గొండ వెళ్తుండగా గురువారం రాత్రి రోడ్డుపై నుంచి పారుతున్న వరద ఉధృతికి ద్విచక్ర వాహనంతో పాటుగా అందులో పడిపోయాడు. వరదలో చెట్టును పట్టుకొని సహాయం కోసం ఎదురుచూస్తుండగా స్థానికులు డయల్ 100 కు సమాచారం అందించారు. గ్రామీణ ఎస్సై నాగరాజ్ ఆధ్వర్యంలో సతీష్, రాజు లు వరదలో చిక్కుకున్న అతడిని తాడు సహాయంతో కాపాడారు. వెంటనే స్పందించి, వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సాహసోపేతంగా వ్యక్తిని కాపాడిన పోలీసులను ప్రజలు అభినందించారు.

Other News

Comments are closed.