వరల్డ్ కప్ 2వ మ్యాచ్ : ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 111 రన్స్ తేడాతో విజయం!

ఇంగ్లండ్ జట్టుపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లోఆస్ట్రేలియా 111 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. కాగా, తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 98 పరుగులతో న్యూజిలాండ్ శుభారంభం చేసిన విషయం తెల్సిందే.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఫించ్ (135), మ్యాక్స్ వెల్ (66), బెయిలీ (55) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను మిషెల్ మార్ష్ దెబ్బతీశాడు.
టాపార్డర్ దారుణంగా విఫలం కాగా బెల్ (36) కాస్త ఫర్వాలేదనిపించినప్పటికీ టేలర్ (98) ఆసీస్ బౌలర్లకు ఎదురునిలబడ్డాడు. సహచరులంతా తక్కువ స్కోరుకే వెనుదిరుగుతున్నా వోక్స్ (37) అండతో కాసేపు ప్రతిఘటించి నాటౌట్‌గా నిలిచాడు.
దీంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 231 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇండ్లండ్ బౌలర్లలో ఫిన్ హ్యాట్రిక్‌తో పాటు 5 వికెట్లు తీసి రాణించగా, ఆస్ట్రేలియా బౌలర్లలో మిషెల్ మార్ష్ 5 వికెట్లు తీసి రాణించాడు. అతనికి స్టార్క్, జాన్సన్ రెండేసి వికెట్లు తీసి సహకారమందించారు.