వరి సాగు నేరుగా విత్తడమే లాభదాయకం.
కూసుమంచి సెప్టెంబర్ 1 ( జనం సాక్షి ) : మండలంలోని ఎవరైనా రైతులు ఇప్పటివరకు వరి నాట్లు వేయనట్లయితే వారు విత్తనాలను నేరుగా జల్లడం ద్వారా రైతుకు మేలు జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి అన్నారు. గురువారం రోజున మండలంలోని జక్కేపల్లి గ్రామంలో కొత్త శ్రీనివాసరెడ్డి వ్యవసాయ పొలంలో వరి విత్తనాలను నేరుగా చల్లే విధానాన్ని చూపించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలా చేయడం వలన వరి నాటుకు అయ్యే ఖర్చు సుమారుగా 7000 రూపాయలు వరకు ఖర్చు తగ్గుతుందని అదేవిధంగా పంట పదిహేను రోజుల నుండి 20 రోజుల ముందుగానే పంట చేతికి అందే అవకాశం ఉన్నదని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈఓ బజ్జురి సౌమ్య , స్థానిక రైతులు పాల్గొన్నారు.