వరుస సిల్వర్‌ జూబ్లీ సినిమాలను అందించిన ఏకైక హీరో రాజేష్‌ఖన్నా

హైదరాబాద్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాజేష్‌ఖన్నా మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దేశ సినీరంగం దిగ్గజ నటుడిని కోల్పోయిందని చిత్ర రంగ పెద్దలు అభిప్రాయపడ్డాడు. వరుసగా 15సిల్వర్‌ జూబ్లీ సినిమాలను అందించిన ఏకైక కథానాయకుడు తొలిసూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. ఆయనతో పలు సినిమాలకు పనిచేసిన అనుభవాలను దాసరి గుర్తుకు తెచ్చుకున్నారు. రాజేష్‌ఖన్నా నటనకు తనో అభిమానినని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మురళీమోహన్‌ అన్నారు. రాజేష్‌ఖన్నా మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని మూవీ మొగల్‌ డి.రామానాయుడు అన్నారు. ఖన్నాతో తనది అన్నదమ్ముల అనుబందమని వ్యాఖ్యానించారు.