వర్షం, పంటనష్టాలను సమీక్షించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, భారీ పంటనష్టంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వహించారు. ఆదివారం ఉదయం రాజమండ్రికి బయలు దేరేముందు ఆయన క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల్లో అకాల వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు శ్రీధర్‌బాబును కరీంనగర్, గీతారెడ్డిని మెదక్‌లకు వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని కోరారు. మిగిలిన మంత్రులను ఆయా జిల్లాల్లో పర్యటించి సహాయ కార్యక్రమాలను సమీక్షించాలని సూచించారు. ప్రభుత్వం బాధితులకు పూర్తిగా అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఆయా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు.