వర్షాల వల్ల 17 మంది మృతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల 17 మంది మృత్యువాత పడ్డారని రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రకటించింది, జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాగులు, వంకలు పొంగుతున్నాయని తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పంట నీట మునిగిందని వెల్లడించింది, రెండున్నర లక్షల హెక్టార్లు వరి, ఇతర ఉద్యాన పంటలు నీట మునిగినట్టు ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నట్లు విపత్తు నివారణ కమిషనర్‌ టి. రాధ తెలియజేశారు. మొత్తం 500 ఇళ్ల వరకూ కూలిపోయాయని, మరో 800 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆయన వివరించారు.