వాట్సాప్ ద్వారా సులభంగా జియోమార్ట్ పై కొనుగోళ్ళు

భారత దేశపు ప్రముఖ ఈ-మార్కెట్ లలో ఒకటైన రిలయన్స్ రీటెయిల్ వారి జియోమార్ట్, వాట్సాప్ ద్వారా ఆర్డర్లను అమలు చేసి నెరవేర్చడములో ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఒకే ఒక ఈ-రీటెయిల్ బ్రాండ్. వాట్సాప్ తో జియోమార్ట్ వారి భాగస్వామ్యముతో, వినియోగదారులు ఇప్పుడు తమ వాట్సాప్ చాట్ లోనే గృహావసరాలను బ్రౌజ్ చేసి కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులకు ప్రపంచ-మొదటి ఉత్పత్తి అనుభవమైన వాట్సాప్ పై జియోమార్ట్ ను అందించుటకు జియో వేదికలు మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. భారతదేశపు డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయుట, ప్రజలు, అన్ని పరిమాణాల అవకాశాల వ్యాపారాలు కొత్త మార్గాలలో కలుసుకొనుటను అనుకూలపరచుట, దేశ ఆర్ధిక అభివృద్ధికి దోహద పడుట ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యం. వాట్సాప్ పై జియోమార్ట్ అనుభవం ప్రజల షాపింగ్ అనుభవానికి అసమానమైన సరళతను, సౌకర్యాన్ని అందిస్తూ, దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు తమ వినియోగదారులతో కనెక్ట్ అయ్యే విధానములో విప్లవం తీసుకొని వస్తుంది. ఈ విశేషత సంపూర్ణ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది, ఎవరైనా వాట్సాప్ లోనే జియోమార్ట్ క్యాటలాగ్ ను బ్రౌజ్ చేయవచ్చు. జియోమార్ట్ పై అందించబడే అపరిమిత ఉత్పత్తుల శ్రేణిని ఆవిష్కరించవచ్చు, ఉత్పత్తులను తమ కార్ట్ కు చేర్చవచ్చు, చెల్లింపు చేసి కొనుగోళ్ళను పూర్తి చేయవచ్చు. సమస్యలు లేని ఈ ఉచిత సేవతో, వినియోగదారులు తమ సౌకర్యాన్ని అనుసరించి ఆర్డర్ చేయవచ్చు. ఎలాంటి సమయం లేదా పరిమాణ ఆంక్షలు లేవు. ఎక్కడ ఉన్నా ఇంట్లో సౌకర్యవంతంగా కూర్చొని ఏ సమయములో అయినా వాట్సాప్ ద్వారా మీ రోజువారి అవసరాలను ఎంచుకొని ఆర్డర్ చేయవచ్చు. జియోమార్ట్ నంబరు 7977079770 కు వాట్సాప్ పంపించాలి. మీరు తక్షణమే షాపింగ్ క్యాటలాగ్, కరెంట్ అఫైర్స్, డీల్స్ పై నోటిఫికేషన్లు అందుకుంటారు.