వాతావరణ మార్పుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కార్యదర్శి భాగ్యలక్ష్మి

share on facebook

:   వాతావరణ మార్పుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :  కార్యదర్శి భాగ్యలక్ష్మి
జహీరాబాద్ మార్చి 18 (జనం సాక్షి). గత మూడు రోజుల నుంచి ఆకస్మిక వాతావరణ మార్పుతో పాటు అకాల వర్షంతో ఒక్కసారిగా ఈదురు గాలులు, వడగళ్ల వర్షంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే, ఇలాంటి ఆకస్మిక వాతావరణ మార్పుతో ప్రజలు అనారోగ్యానికి గురవడంతో పాటు వైరల్ జ్వరాల బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్యరంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు, ఇదే విషయమై శేకపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అకాల వర్షాల వల్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు ముఖ్యమైన సూచనలు ఇచ్చారు, అత్యవసరం అయితే తప్ప వర్షల్లో బయటికి రావొద్దని, తాగే నీళ్లను వేడి చేసి చల్లార్చి తాగాలని, ఏ మాత్రం అనారోగ్య సూచనలు అనిపించిన డాక్టర్ ని సంప్రదించాలని, భౌతికంగా దూరంగా ఉండి తమ ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని, ఇళ్లలో, గల్లీలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వెయ్యడం వల్ల ఈగలు, దోమలు రావడంతో దాని పర్యవసానంగా రోగాలకు గురయ్యే ప్రమాదం ఉన్నందున చెత్తను బుట్టలో వేయాలని, పంచాయతీ సిబ్బంది ఉదయం పూట సేకరిస్తుందని గ్రామ పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి గ్రామస్తులకు సూచించారు..

Other News

Comments are closed.