వాయిలార్‌ రవితో టీ.కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

డిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈ రోజు డిల్లీలో వాయిలార్‌ రవితో భేటీ అయ్యారు. ఒకటి రెండు వారాల్లో పీసీసీ పునర్‌ వ్యవస్థికరణకు కసరత్తు ప్రారంభమవుతుందని ఆయన చెప్పినట్లు ఎంపీలు పేర్కొన్నారు. ధర్మాన రాజీనామ విషయంలో జోక్యానికి కాంగ్రెస్‌ అధిష్టానం సుముఖత చూపడం లేదని సమాచారం. రాజీనామ అంశాన్ని సీఎం నిర్ణయానికే వదిలేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు వారు తెలిపారు.