వారసత్వ ఉద్యోగాలను కార్మికులకు అంకితం చేస్తాం ధ్వంద్వ వైఖరి అవలంబిస్తున్న ఏఐటీయూసీ

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి): గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్‌టీయూసీి వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కార్మికులకు ఆ హక్కును అంకితం చేస్తామని కేంద్ర కమిటీి ఉపాధ్యక్షుడు పిచ్చేశ్వర ్‌రావు అన్నారు. శనివారం స్థానిక కాకతీయ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకు మూడుసార్లు గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీయూసీి ధ్వంద్వ వైఖరి అవలంబిస్తూ కార్మికులను మోసం చేయాలని చూస్తున్నట్లు విమర్శించారు. పరకాల ఉప ఎన్ని కల్లో సీపీిఐ పార్టీ టీిఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతునిచ్చి, సింగరేణిలో మాత్రం టీబీజీకేఎస్‌ మద్దతు కోరడం ఏమిటని ప్రశ్నించారు. అధికారం కోసం నాడు టీి ఎన్‌టీయూసీ మద్దతు తీసుకున్నట్లు, ప్రస్తుతం టీబీ జీకేఎస్‌ మద్దతు తెలపాలని కోరడం వారి దిగ జారుడు తనానికి నిదర్శనమన్నారు. ఐఎన్‌ట ియుసి గుర్తింపు కాల సమయంలో 45 డిమాండ ్‌లను ఒక్క రోజు సమ్మె చేయకుండా సాధించినట్లు తెలిపారు. 25వేల ప్రమోషన్లు ఇప్పించినట్లు, 4 వేల క్వార్టర్లను కట్టించినట్లు, వృత్తి పన్ను మాఫి చేసినట్లు వివరించారు. ప్రధానంగా కార్మికులకు గ్రూప్‌ గ్య్రాట్యుటి ఇన్స్‌రెన్స్‌ ఇప్పించినట్లు ఇది చారిత్రక విజయంగా అభివర్ణించారు. తొలుత రూ. 298 కోట్లతో అగ్రిమెంటు చేయగా ప్రస్తుతం రూ 1150 కోట్లకు చేరినట్లు చెప్పారు. గనులలో ఫ్యాటల్‌ ప్రమాదాలు జరిగితె చంద్రబాబు హ యాంలో రూ. 6 లక్షలు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ 7 లక్షలు ఇప్పించినట్లు తెలి పారు. ప్రస్తుతం ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మి కులకు వారికి ఇచ్చే అన్ని సౌకర్యాలతో పాటు రూ. 5 లక్షలు ఇప్పించేలా అగ్రిమెంట్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఏఐటియుసి అధికారంలో ఉండి 42 డిమాండ్‌లు సాధించామని ప్లెక్సీ రూపంలో గను లపై ఏర్పాటు చేసిందని కాని వాటిలో 35 డిమా ండ్‌ల వరకు సాదారణంగా యాజమాన్యం ఇచ్చే దని, మిగిలిన కొన్నింటిలో ఐఎన్‌టియుసి అంతకు ముందే అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు చెప్పారు. కాని ఆ నాయకులు మాత్రం తామే సాధించామని ప్రగ ల్బాలు పలుకుతూ కార్మికులను మోసం చేయాలని చూస్తున్నట్లు ఆరోపించారు. మరోసారి ఏఐటి యుసిని నమ్మితే సింగరేణిని పూర్తిస్థాయిలో ప్రైవేట్‌పరం చేయనున్నట్లు విమర్శించారు. రాను న్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్మికుల సమ స్యలు, ఇబ్బందులు, నష్టాలను, స్వయంగా గమ నించి అందరికంటే ముందుగా మెనిఫేస్టో రూపొం దించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం, వాదం వేరని అదేవిధంగా సింగరేణిలో ఎన్నికలు వేరని పేర్కొన్నారు. వాదాన్ని అడ్డుపెట్టుకొని టిబి జికెఎస్‌ గెలవాలని చూస్తున్నదని విమర్శించారు. గత ఎన్నికల్లో మూడు పర్యాయాల్లో గెలిచి ఏం సాధించారని ప్రశ్నించారు. టిబిజికెఎస్‌కు ఎట్టి పరిస్థితుల్లో వేజ్‌బోర్డులో సభ్యత్వం రాదని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు త్యాగరాజు, తిరుపతి, జక్కిరెడ్డి, రాజేందర్‌, రత్నం, సమ్మిరెడ్డి, నర్సింగరావు, శంకర్‌, శ్రీనివాస్‌, ప్రభాకర్‌, జావేద్‌, భిక్షపతి, లక్ష్మారెడ్డిలు పాల్గోన్నారు.