వింబుల్డన్‌ ఫైనల్‌ ముర్రే

లండన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆండ్రే ముర్రే ఫైనల్‌కు చేరు కున్నాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సొంగా పై 6-3, 6-4, 3-6, 7-5 సెట్ల తేడాతో విజయం సాధించాడు. దీంతో ఫైనల్లో ముర్రే రోజర్‌ ఫెదరర్‌ తో తలపడనున్నాడు. 74 ఏళ్ల తర్వాత వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి బ్రిటిష్‌ ఆటగాడిగా ముర్రే అరుదైన రికార్డు సృష్టించాడు.