విఆర్ఏల దీక్షకు ఎమ్మార్పీఎస్ బీసీ బలహీన వర్గాల సంక్షేమ సంఘాల సంఘీభావం
ఆత్మకూర్(ఎం) ఆగస్టు 24 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు చేపడుతున్న వి ఆర్ ఏ ల దీక్ష శిబిరాన్ని ఎమ్మార్పీఎస్ యంఎస్ పీ యంఎస్ఎఫ్ బీసీ బలహీన వర్గాల సంక్షేమ సంఘాల ఆద్వర్యం లో సందర్శించి వారికి మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సంధర్భంగా నాయకులు మాట్లాడుతూ గత నెల రోజులుగా దీక్షలు చేస్తున్న విఆర్ ఏ ల పోరాటానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి వి ఆర్ ఏ లకు ప్రమోషన్లు ఇవ్వాలని యాభై ఐదు యేండ్లు దాటిన వారి స్థానం లో వారి వారసులకు అవకాశం ఇవ్వాలని వి ఆర్ ఏ లకు వేతన పేస్కెల్ జీవో విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ యంఎస్పీ బీసీ బలహీన వర్గాల సంక్షేమ సంఘాల పక్షానా డిమాండ్ చేయడం జరిగింది ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ యం ఎస్ పీ జిల్లా కో ఆర్డినేటర్ నల్ల చంద్రస్వామి మాదిగ బీసీ బలహీన వర్గాల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ కానుగంటి శ్రీశైలం కురుమ ఎమ్మార్పీఎస్ యం ఎస్ పీ మండల కో ఆర్డినేటర్ ముందుల లింగ స్వామి మాదిగ యంఎస్ఎఫ్ జిల్లా కో కన్వీనర్ నల్ల బాలరాజు మాదిగ మహాజన కళామండలి నాయకులు కార్పాటి యాదగిరి మాదిగ యంఎస్ఎఫ్ మండల నాయకులు కదిరే సాయి వినయ్ మాదిగ నల్ల భాను ప్రసాద్ మాదిగ