ఓటెత్తిన పల్లెలు
` తొలి విడతలో పంచాయితీ ఎన్నికల్లో భారీగా తరలివచ్చి ఓటేసిన గ్రామీణం
` 84.28 శాతం పోలింగ్ నమోదు
` యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 92.88%
` జల్లా కొత్తగూడెంలో అత్యల్పంగా 71.79 %
` ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్
` మూడుచోట్ల లాటరీలో సర్పంచుల ఎన్నిక
` మూడు సర్పంచి స్థానాలు లాటరీ ద్వారా ఎన్నిక
` యాదాద్రి, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో అభ్యర్థుల విజయం
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో తొలి విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. 45,15,141 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా మొదటి దఫా ఎలక్షన్స్‌లో 84.28 పోలింగ్ నమోదైంది. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 92.88 ఓటింగ్ నమోదైంది.బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంటతో పూర్తయ్యింది. పలుచోట్ల ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. రాత్రి వరకు పోలింగ్ ఫలితాలు ప్రకటించి.. ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహించారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు పోలింగ్‌ను పర్యవేక్షించారు. తొలి విడుతలో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇందులో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 3,834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 12,960 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు విడుతల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం 93,905 మంది సిబ్బందిని నియమించినట్టు ఎస్‌ఈసీ కమిషనర్ పేర్కొన్నారు. మూడు విడుతల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం 93,905 మంది సిబ్బందిని నియమించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. 3,591 మంది రిటర్నింగ్ అధికారులను, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు చెప్పారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా 3,461 పోలింగ్ కేంద్రాలను.. 45,086 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి విడుతలో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇందులో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగతా 3,834 సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తుండగా.. 12, 960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే, ఒక గ్రామ పంచాయతీ, పది వార్డుల్లో ఎన్నికలను నిలిపివేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 56,19,430 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు ఇందులో పురుషులు 27,41,070, మహిళలు 28,78,159, ఇతరులు 201 మంది ఉన్నారు. మూడు విడుతల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం 93,905 మంది సిబ్బందిని నియమించినట్టు ఎస్‌ఈసీ కమిషనర్ పేర్కొన్నారు. 3,591 మంది రిటర్నింగ్ అధికారుల ను, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్టు చెప్పారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా 3,461 పోలింగ్ కేంద్రాలను పరిశీలించినట్లు చెప్పారు. 45,086 బ్యాలెట్ బాక్సులను వినియోగించిట్టు చెప్పారు.
తొలివిడతలో హస్తానిదే హవా
` భారీ సంఖ్యలో సర్పంచులుగా విజయం సాధించిన హస్తం మద్దతు దారులు
` ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనం
` సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై మహేశ్ గౌడ్ హర్షం
హైదరాబాద్(జనంసాక్షి):గురువారం జరిగిన తొలివిడత పంచాయితీ పోరులో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో సర్పంచులుగా విజయం సాధించారు. రెండో స్థానంలో బీఆర్‌ఎస్ నిలవగా తక్కువ సంఖ్యతో బీజేబీ అభ్యర్థులు గెలుపొందారు. తొలి విడతలో మూడు సర్పంచి స్థానాలు లాటరీ ద్వారా తేలాయి. యాదాద్రి జిల్లా లక్ష్మక్కపల్లిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతిచ్చిన అభ్యర్ధులకు 148 ఓట్లు వచ్చాయి. దాంతో, విజేతను తేల్చడం కోసం అధికారులు లాటరీ తీశారు. లాటరీలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఇండ్ల రాజయ్య సర్పంచ్‌గా ఎంపికయ్యారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరంపల్లిలోనూ లాటరీ తప్పలేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్ధులకు సమానంగా 276 ఓట్లు వచ్చాయి. లాటరీ తీయగా బీఆర్‌ఎస్ బలపరిచిన మైలారం పోచయ్య సర్పంచ్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చిన్న ఎల్క చెర్లలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులకు 212 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ లోనూ ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో అధికారులు.. టాస్ వేశారు. టాస్‌లో.. కాంగ్రెస్ అభ్యర్తి మరాఠి రాజ్‌కుమార్‌ను అదృష్టం వరించింది.రేగోడ్ మండలం కొండాపూర్‌లో ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి బేగరి పాండరి గెలుపొందారు. వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్లారు పోలింగ్‌లో 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడ్డారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఏకగ్రీవంతో కలుపుకొని 776 మందికిపైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. భారత రాష్ట్ర సమితి బలపర్చిన అభ్యర్థులు 312 మంది, భాజపా 63 మంది, ఇతరులు 164 మంది గెలుపొందారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తల్లి, కుమార్తె మధ్య ఆసక్తికర పోరు నడిచింది. తిమ్మయ్యపల్లె రిజర్వేషన్‌లో బీసీ మహిళకు కేటాయించారు. దీంతో శివరాత్రి గంగవ్వకు భారత రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించగా.. కుమార్తె సుమలతను అధికార కాంగ్రెస్ బలపరిచింది. పోలింగ్ అనంతరం జరిగిన ఓట్ల లెక్కింపులో తల్లి గంగవ్వపై సుమలత 91 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బద్యాతండాలో ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. మొదట ఒక ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు సర్పంచిగా గెలిచినట్టు ప్రకటించారు. రెండోసారి రీకౌంటింగ్‌లో 3 ఓట్ల తేడాతో భారత రాష్ట్రసమితి మద్దతుదారు విజయం సాధించినట్టు ప్రకటించారు. కాంగ్రెస్ మద్దతుదారు ఆందోళనతో అధికారులు మూడోసారి ఓట్ల లెక్కింపు చేపట్టారు. యాదాద్రి జిల్లా లక్ష్మక్కపల్లిలో ఉత్కంఠ పోరు సాగింది. సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరికీ సమానంగా 148 చొప్పున ఓట్లు రావడంతో అధికారులు లాటరీ తీశారు. డ్రాలో భారత రాష్ట్ర సమితి మద్దతుదారు ఇండ్ల రాజయ్యను విజయం వరించింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడెంలో భాజపా బలపరిచిన సర్పంచి అభ్యర్థి రేవతి 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు.పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో కాంగ్రెస్, భారత రాష్ట్రసమితి నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, డెయిరీ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరువర్గాలను పోలీసుల చెదరగొట్టారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌లో రాళ్లు, కత్తులతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల పదోవార్డులో పోలింగ్ కాసేపు నిలిచిపోయింది. బ్యాలెట్ పేపర్‌పై వార్డు అభ్యర్థి డేరాంగుల యాదమ్మకు గుర్తు కేటాయించకపోవడంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. అరగంట తర్వాత వేరే బ్యాలెట్ పేపర్లు తీసువచ్చి పోలింగ్‌ను కొనసాగించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల పోలింగ్ కేంద్రం వద్ద వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు. వీల్‌ఛైర్‌లు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కుటుంబసభ్యులు వారిని చేతులపై మోసుకుంటూ వెళ్లి ఓటు వేయిస్తున్నారు.
ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనం:మహేశ్ గౌడ్
రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం.. ప్రజల విశ్వాసానికి నిదర్శనమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల తొలి విడతలో.. కాంగ్రెస్ మద్దతుదారులైన అభ్యర్థులు ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయం స్పష్టంగా కనిపించిందన్నారు. మొదటి విడత ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అనుబంధ అభ్యర్థులే గెలుపొందడం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అద్దం పట్టే ఈ ఫలితాలు, ప్రభుత్వంపై వారి అపార నమ్మకాన్ని తిరిగి చాటుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు విడుదల చేసిన ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో, పార్టీ తరఫున ఎన్నికల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. నిరంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను సమన్వయం చేస్తూ గ్రామ స్థాయి వరకు ప్రచార వ్యూహాలు రూపొందించి అమలు చేసిన విధానమే ఈ విజయానికి ప్రధాన కారణమన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో, ప్రజలను నేరుగా కలిసే పద్ధతి కాంగ్రెస్‌కు మరింత అనుకూలంగా మారిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు సంవత్సరాల ప్రజాపాలన సంక్షేమం- అభివృద్ధి పథకాలతో ప్రజలకు చేరువైందని, ప్రజా పాలన పట్ల ప్రజల సంతృప్తి పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించిందని మహేశ్‌గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. గ్రామస్థాయి సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేయడం, గ్రామీణ ఓటర్లలో కాంగ్రెస్‌పై విశ్వాసం పెరిగేందుకు కారణమైందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, రైతులు, యువత విస్తృతంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం, గ్రామ పాలనా వ్యవస్థలో నూతన దిశకు సంకేతం అని వ్యాఖ్యానించారు. ఈ విజయం పార్టీకి మరింత బాధ్యతను పెంచిందని.. గ్రామీణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ప్రాధాన్యత కేంద్రంగా మార్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.


