వికలాంగులకు క్రీడా పోటీలు

కాప్రా పట్టణంలో పోమవారం వికలాంగుల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి, స్థానిక హెచ్‌బికాలనీలోని ఫెజ్‌ 1క్రీడా మైదానంలో మల్లాపూర్‌ కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డి నాచారం కార్పొరేటర్‌ నెమిలి సురేష్‌లు ఈపోటీలను ప్రారంభించారు. పట్టణంలోని వికలాంగులకు కుర్చీ ఆట.చెండా గోళీ పోటీలు నిర్వహిస్తున్నట్లు వికలాంగుల సమాఖ్య ఆధ్యక్షుడు టి. చంద్రశేఖర్‌.కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు  విజేతలకు డిసెంబర్‌ 3న ప్రపంచ విలాంగుల దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తామన్నారు.