వికలాంగులకు పౌష్టికాహారం పంపిణీ

 

రుద్రంగి ఆగస్టు 27 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో శనివారం సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ గ్రామంలోని వికలాంగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వికలాంగులకు గోధుమలు,టాబ్లెట్స్,టానిక్ బిస్కెట్స్ వంటి పౌష్టికాహారాలను అందించామన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.