వికలాంగ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం, జూలై 20 : ఖమ్మం పట్టణంలోని స్తంభానినగర్‌లో ఉన్న చవిటి, మూగ, అంధ బాలబాలిక రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల కరస్పాండెంట్‌ లాలూ ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికలకు ఉచిత విద్య, భోజన, వసతి సౌకర్యం కల్పించనున్నట్టు ఆయన వెల్లడించారు. విద్యార్థులు అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను తీసుకుని పాఠశాలకు రావాలన్నారు. ఇతర వివరాలకు 9848503617 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ నెల 30లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.