వికారాబాద్ ఆలంపల్లి కెంపిన మఠంలో జరగబోయే శంకర స్వాముల 23వ వార్షిక పుణ్య స్మరణోత్సవ కార్యక్రమం

వికారాబాద్ ఆలంపల్లి కెంపిన మఠంలో జరగబోయే శంకర స్వాముల 23వ వార్షిక పుణ్య స్మరణోత్సవ కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది.దీనితోపాటు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం యువజన విభాగం 2023 క్యాలెండర్ను బంటారం మండలంలో ఆవిష్కరణ రాష్ట్ర అధ్యక్షుడు కల్లపల్లి రచప్ప ఆవిష్కరణ చేశాడు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ లింగాయతులు అందరూ ఐక్యమత్తంగా ఉండి ఓబీసీని సాధించుకునే అంతవరకు పోరాడాలని తెలియజేశాడు అలాగే వికారాబాద్ ఆలంపల్లి కెంపిన మఠంలో రేపు అనగా 14 3 2023 నాడు జరగబోయే శంకర స్వాముల 23వ వార్షిక పుణ్య స్మరణోత్సవ కార్యక్రమానికి వికారాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్క శరణు బంధువులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కల్లపల్లి రచప్ప మరియు లోకేష్ ,ఉమాశంకర్, మల్లేపల్లి రాకేష్, కిషోర్ సుధీర్ పటేల్ కోటిలింగం శ్రీబసవసంగమేశ్వరభక్తిటీవీ చైర్మన్ బంటారం మండలం వీరశైవ లింగాయత్ యువజన విభాగం సభ్యులు శివకుమార్ వీరేష్ బసవరాజ్ బుచ్చప్ప సిద్ధిరాములు స్వామి తదితర యువజన బృందం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు