విచారణకు రాకపోతే చర్యలు తీసుకుంటాం : డీజీపీ

హైదరాబాద్‌: విచారణకు రాకపోతే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్‌పై పలు కేసు నమోదైన నేపథ్యంలో విచారణకు హాజరుకావాల్సిందిగా కోరినట్లు ఆయన తెలియజేశారు. విచారణకు తాను హాజరవుతానని అక్బరుద్దీన్‌ సమాచారం ఇచ్చారన్నారు. ఆయన రాకపోతే రెండు మూడు రోజులు వేచి చూస్తామన్న డీజీపీ, హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. అత్యాచార కేసుల విచారణలో 2 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు ఉండాలని కేంద్రానికి తెలిపినట్లు ఆయన అన్నారు.