విజయమ్మపై బొత్స ఫైర్‌

హైదరాబాద్‌ : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.  గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న విజయమ్మ మాట్లావి అన్ని అబద్ధాలేనని విమర్శించారు. వైఎస్‌రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కొడుకు జగన్‌ చేసిన అక్రమాలను విజయమ్మ ఎందుకు అడ్డుకోలేని ప్రశ్నించారు. తన కొడుకు గురించి అన్నీ తెలిసిన విజయమ్మ తాను మాట్లావి నిజాలో అబద్ధాలో తెలుసుకోవాలన్నారు. తన అన్నకు వత్తాసు పలుకుతూ ప్రచారంలో నానా రభస చేస్తున్న షర్మిల తాను కట్నంగా తీసుకున్న బయ్యారం గనులపై ప్రజలకు వివరణ ఇవ్వాలని బొత్స డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీకి ఓట్లేస్తే ఆ క్యాబినేట్‌ అంతా జైలులోనే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు.