విజయవంతంగా ముగిసిన ఉచిత వైద్య సేవలు

 

 

 

 

 

మంగపేట,సెప్టెంబర్ 03 (జనంసాక్షి):-

శ్రీ సత్యసాయి సంచార మెడికల్ సేవలు, తెలంగాణ వారి సౌజన్యంతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దంత వైద్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మార్వో వై.శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ కుడుముల లక్ష్మినారాయణ.ఈ దంత వైద్య పరీక్ష శిబిరంలో 6 వ నుండి10వ  తరగతి విద్యార్థినీ విద్యార్ధులు, కాలేజ్ విద్యార్థులకు సుమారు 250 మందికి డెంటల్ పరీక్షలు నిర్వహించి,అవసరమైన వైద్యం చేసి మందులు ఇవ్వడం జరిగింది.అలాగే పిల్లలందరికీ టూత్ బ్రష్, పేస్టు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో డా.జి  మౌనిక బి డి ఎస్,డా.పి.సౌమ్య  బి డి ఎస్ బోత్ డా. కె.ప్రకాష్ రెడ్డి బి డి ఎస్, శ్రీ సత్యసాయి సేవా సంస్థల పెద్దలు పాల్గొని విజయవంతం చేశారు.