విజయవాడలో సందడి చేసిన నటి అక్ష

విజయవాడ: సినీ నటి అక్ష విజయవాడలో సందడి చేసింది. బెంజిసర్కిల్‌ వద్ద సంపంగి స్పాపేరిట ఏర్పాటు చేసిన బ్యూటి షోరూంను ఆమె ప్రారంభించింది. ఈ కేంద్రంలో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశామని.. కోస్తా జిలాల్లల్లో ఇది పెద్ద కేంద్రమని నిర్వహకులు పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కార్పొరేషన్‌ బ్యాంక్‌ డీజీఎం రామాంజనేయులు పాల్గొన్నారు.