విజయవాడలో 9 నుంచి రాష్ట్రస్థాయి టేబుల్‌టెన్నిస్‌ పోటీలు

విజయవాడ: స్థానిక డీఆర్‌ఎంసీ నగరపాలక సంస్థ ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 9వ తేదీనుంచి రాష్ట్రస్థాయి టేబుల్‌టెన్నిస్‌ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో క్యాడేట్‌ సబ్‌జూనియర్‌, యూత్‌ సీనియర్‌ కేటగిరీల్లో  రాష్ట్రంలోని పలు ప్రాంతాల క్రీడాకారులు పాల్గొంటారు. ఈ పోటీలను 9వ తేదీ ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్‌ అబ్దుల్‌ అజీం ప్రారంభిస్తారు.