విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే

` ప్రయత్నాల్లో ఉన్నాం
` రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం కేంద్రంతో చర్చిస్తున్నాం
` దేశంలో హైదరాబాద్‌ను రోల్‌ మోడల్‌ సిటీగా మార్చుతాం
` ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాల్సిఉంది
` మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
హైదరాబాద్‌ (జనంసాక్షి):రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం కేంద్రంతో చర్చిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విూడియాతో తెలిపారు. హైదరాబాద్‌ లో సూపర్‌ గేమ్‌ ఛేంజర్‌ గా ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చిందన్నారు. దీంతో పాటు హైదరాబాద్‌ నుంచి విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే సాధన కోసం కూడా గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రయత్నించానని మంత్రి కోమటిరెడ్డి వెల్లడిరచారు . హైదరాబాద్‌ నుంచి విజయవాడ ఒక ఎక్స్‌ ప్రెస్‌ హైవే పెట్టాలని.. ఒక గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే మంజూరు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపారు. అది మంజూరు అయితే హైదరాబాద్‌ నుంచి విజయవాడ ఎవ్వరూ ఎక్కరని తెలిపారు. దేశంలో హైదరాబాద్‌ ను రోల్‌ మోడల్‌ సిటీగా మార్చుతామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఇంకా ఎన్నో అభివఅద్ధి చేయాల్సినవి ఉన్నాయని వెల్లడిరచారు. ప్రజల కోసమే కాంగ్రెస్‌ పని చేస్తుందని తెలిపారు.