విద్యారంగానికి పెద్దపీట వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
గురుకులాల పై అపోహాలు తొలగించాల్సిన బాధ్యత మనందరిది విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదివితేనే భవిష్యత్తులో రాణిస్తారు యంయల్ఏ
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సెప్టెంబరు11( జనంసాక్షి) గట్టు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ పిలుపునిచ్చిన స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో గద్వాల నియోజకవర్గం గట్టు మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గట్టు మరియు మానోపాడు పాఠశాలల విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా చివరి రోజు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులకు యంయల్ఏ పలు సూచనలు ఇచ్చారు
ఎమ్మెల్యే మాట్లాడుతు గతంలో ఈ ప్రాంతం అక్షరాస్యత శాతం వెనకబడి ఉండేది కానీ 8 ఏళ్ల సీఎం కేసీఆర్ గారి పాలనలో అక్షరాస్యత ముందుకు వెళ్తున్నది గతంలో ఎక్కడో ఒకచోట గురుకుల పాఠశాలలు ఉండేది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి మండలానికి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి పై లక్ష ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయడం జరుగుతుంది వారికి ఇంగ్లీష్ బోధన సౌకర్యం అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు
గతంలో అక్షరాస్యతలో గట్టు మండలం 17% ఉండేది కానీ ప్రస్తుతం 40% శాతం కావడం జరిగింది. గురుకుల జూనియర్ కాలేజీ నుండి భవిష్యత్తులో డిగ్రీ కాలేజీ కూడా మంజూరు అయ్యేవిధంగా కృషి చేస్తానని తెలిపారు విద్యార్థుల చదువు పట్ల తల్లిదండ్రుల పాత్రపై అవగాహన కల్పించారు
స్వచ్ఛ గురుకుల్ “ప్రోగ్రాంలో భాగంగా పాఠశాలలు స్వచ్ఛ పాఠశాలలుగా మారాయి అన్నారు ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం వహించి పాఠశాల స్వచ్ఛత కు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు ధఇదే స్ఫూర్తితో నిత్యం కొనసాగించాలన్నారు. పాఠశాలలు పచ్చదనంతో కలకళలాడలన్నారు
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గురుకుల విద్యార్థులకు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్, వైరల్ జ్వరాలు వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ద్వారా వాటికి అడ్డుకట్టవేయవచ్చని అన్నారు
తల్లిదండ్రులు చిన్న చిన్న కారణాలు చెప్పి పిల్లలును ఇండ్లకు తీసుకువెళ్లారాదు కొందరి అజాగ్రత్త వల్ల గురుకులాలపై సమాజంలో అపోహలు ఏర్పడుతున్నాయి, వాటిని తొలగించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, గురుకుల పాఠశాల సిబ్బందితో పాటు తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు
చదువుతో పాటు భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకుంటారో విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని సూచించారు. అందుకు పాఠశాల సిబ్బంది సహకారం తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరం అన్నారు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పినట్లు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడి ఇష్టపడి చదివితేనే భవిష్యత్తులో రాణిస్తారని వివరించారు
ఎమ్మెల్యే గారి నిధులు నుండి 3 లక్ష రూపాయలతో విద్యుత్ సరఫరా మెరుగుపర్చామని , అలాగే ఎంపీపీ నిధుల నుండి నీటి సరఫరా చేయడం జరిగిందన్నారు
ఈ గురుకులాలకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఉత్తమ స్వచ్ఛ గురుకుల పురస్కారం రావాలని ఆకాంక్ష క్షిచారు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (సెప్టెంబర్ 5న) రోజున స్వచ్ఛ గురుకుల ప్రతిజ్ఞతో ప్రారంభమై వారం పాటు నిర్వహించిన కార్యక్రమాలలో స్వచ్ఛ గురుకుల్ డ్రైవ్ ప్రాముఖ్యతను తెలిపేలా విద్యార్థులతో నాటకాలు, నృత్యాలు, పాటలు, ఫ్లాష్మాబ్ల వంటి ప్రదర్శనలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థినులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ప్రతి ఒక్కరు కష్టపడి చదువుకొని భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలి ప్రభుత్వ ఉద్యోగంలో సాధించాలి మీ తల్లిదండ్రులకు , మీ పాఠశాలకు, మీ గ్రామానికి , గద్వాల నియోజకవర్గం మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు
గురుకుల పాఠశాల ఆవరణంలో ఎమ్మెల్యే గారు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కుమార్, జెడ్పిటిసి బాసు శ్యామల, హనుమంతు ఎంపిటిసి రంగ స్వామి,పై
తెరాస పార్టీ నాయకులు గద్వాల తిమ్మప్ప, గోవిందు, తిమ్మప్ప, ప్రిన్సిపల్, వాణి ఉపాధ్యాయ బృందం, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
|