విద్యార్థినిపై పాస్టర్‌ లైంగింక వేధింపులు

దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత
భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  జిల్లాలో ఓ విద్యార్థనిపై పాస్టర్‌ దారుణంగా ప్రవర్తించాడు. విద్యార్థి అని కూడా చూడకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  దమ్మపేట సెయింట్‌ మెరీస్‌ స్కూల్‌లో 9వ తరగతి చదవుతున్న విద్యార్థినిని పాస్టర్‌ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాస్టర్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. పాస్టర్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు