విద్యార్థిని 3 గంటల పాటు నిర్భందించిన స్కూలు యాజమాన్యం

హైదరాబాద్‌: స్కూల్‌ఫీజు చెల్లించలేదని 3 గంటల పాటు గదిలో విద్యార్థిని నిర్భందించి భయ భ్రాంతులకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదేంటి అని ప్రశ్నించిన తల్లిదండ్రులతో స్కూలు యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. దీంతో తల్లిదండ్రులు విద్యార్థిసంఘాలతో కలిసి పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.