విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
జనంసాక్షి, మంథని : నేటి సమాజంలో విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. శుక్రవారం మంథనిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినిలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తున్నామన్నారు. ఆకలి విలువ తెలిసిన జడ్పి చైర్మన్ పుట్టమధు తన తల్లి పేరున పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా ఉచితంగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందజేసారన్నారు. నేటి సమాజంలో చదువుకు ఉన్న విలువ ఎంతో గొప్పదన్నారు. తల్లిదండ్రులను గౌరవిస్తూ సమాజానికి సేవ చేసే స్థాయిలో ఉండేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం పలు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆహూతులను కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సలీమ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అరెపల్లి మోహన్, ప్యాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ ప్రిన్సిపాల్ అంబరీష్,ఎక్లాస్ పూర్, ఆరెంద ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్ ఎం లు సంపత్ రావ్, శ్రీనివాస్, కౌన్సిలర్ రజిత రమేష్, డైరెక్టర్ గొబ్బూరి వంశీ, అధ్యాపకులు ఝాన్సీ, శ్రీధర్ రావు, రవి, శశాంక్, తిరుపతి, ఎల్ ఆర్ కె రెడ్డి, తిరుమల్, శ్రీదేవి, నగేష్, చిన్నయ్య, మానస, కొమురయ్య బోధనేతర సిబ్బంది శ్రీనివాస్, రాజయ్య, సుజాత, అర్జయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.